తగిన శిక్ష
తగిన శిక్ష
విజయపురి అనే ఊరికి దగ్గరలో ప్రశా౦తమైన
వనం ఉండేది. అందులో ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మాండవ్యుడు అనే ముని ఉండేవాడు. ఆయన
మహా తపస్స౦పన్నుడు. సకల తీర్థాలను దర్శించి వచ్చి ఇక్కడ తపస్సుని ప్రారంభించాడు.
అదే సమయంలో రాజుగారి కోటలో దొంగలు పడి ఖజానా మొత్తం ఖాళీ చేశారు. ఆ దొంగలు
రాజభటుల నుండి తప్పించుకొని మాండవ్యుని ఆశ్రమానికి చేరుకున్నారు.
రాజభటులు దొంగలను వెంబడిస్తూ ఆశ్రమానికి వచ్చారు. "రాజుగారి ఖజానాను దోచుకున్న దొంగలు ఎటు వెళ్ళారంటూ" భటులు మాండవ్యుని ప్రశ్నించారు. మాండవ్య ముని తపస్సులో ఉండడం చేత ఏమి చెప్పలేదు. రాజభటులు ఆశ్రమానికి చేరుకోడం చూసిన దొంగలు, అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయారు.

ముని ఏమిచెప్పకపోవడంతో ఆశ్రమంలోకి ప్రవేశించిన రాజభటులకు రాజుగారి ధనాగారం
నుండి దొంగలు దోచుకున్న దోపిడీ సొత్తు కనిపించింది. అది చుసిన రాజభటులు ఈ దోపిడిలో
మునికి కూడా భాగస్వామ్యం ఉందని అనుమానించి వెంటనే ఆ సొత్తుని,మునిని కలిపి
రాజుగారి దగ్గరకు తీసుకవెళ్ళారు. దొంగలకు సహకరించాడన్న అనుమానంతో ముని మెడలో శూలం
గుచ్చి ఉంచమన్నాడు మాహారాజు.
కొద్దిరోజుల్లోనే దొంగలు రాజభటులకు చిక్కారు. వారికి మరణదండన విధించారు మహారాజు.
కొద్దిరోజుల్లోనే దొంగలు రాజభటులకు చిక్కారు. వారికి మరణదండన విధించారు మహారాజు.
శూలం గుచ్చి ఉంచబడిన ముని తపోనిష్టలో ఎటువంటి
మార్పు రాలేదు. మునిని చూడడానికి ఇతర మునులు పక్షుల రూపంలో వచ్చి
దర్శించుకోసాగారు. శూలం గుచ్చుకొని కూడా చనిపోకుండా తపోనిష్ట కొనసాగించడం,
ఎక్కడెక్కడి నుండో పక్షులు వచ్చి మాండవ్యుని దర్శికోవడం గురించి విన్న
రాజుగారికి.... మాండవ్య ముని నిజంగానే ఒక మహాత్ముడే అనే నమ్మకం కలిగింది. మాండవ్య
మునిని వెంటనే విడుదల చేసి క్షమించమని వేడుకొన్నాడు. అయితే "ఇదంతా నా
ప్రారబ్ధ కర్మ ఫలితమే!" అంటూ మాండవ్య ముని ముందుకు సాగిపోయాడు. కొన్నాళ్ళ
తర్వాత మాండవ్య ముని యమధర్మరాజుని కలుసుకున్నప్పుడు ఇలా అడిగాడు "యమధర్మరాజ!
అంతగా శిక్షను అనుభవించేందుకు నేను చేసిన పాపం ఏమిటి?"
"మాండవ్య మహర్షి! మీరు చిన్నతనంలో తూనీగల రెక్కలకి ముళ్ళు గుచ్చి
ఆనందించే వారు.
ఆ తప్పుకి తగిన ఫలితంగానే శూల దండనని అనుభవించారు" అని యమధర్మరాజు చెప్పాడు. యముని మాటలు విన్న ముని తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పులు శిక్షార్హం కాదని, అయినా తనకు అంత పెద్ద శిక్ష విధించినందుకు యముణ్ణీ మానవుడిగా పుట్టమని శపించాడు మాండవ్యుడు. తర్వాత కాలంలో యముడు ముని శాపం ప్రకారం విదురుడిగా జన్మించాడు.

అంటే ఎవరైనా కాని ఎటువంటి వారైనా కాని తెలిసి చేసినా, తెలియక చేసినా తాము
చేసిన పాపానికి "తగిన శిక్ష" అనుభవించక తప్పదు.
అందుకే
అన్ని ప్రాణుల పట్ల మనం దయగలిగి ఉండాలి. మన ఆనందం కోసం వాటిని బంధించి,
హింసి౦చకూడదు అన్నదే ఈ కథలోని నీతి.
No comments: