స్వార్ధ ఫలం
స్వార్ధ ఫలం
రామాపురం అనే గ్రామలో ఇద్దరు అన్నదమ్ములు
ఉండేవారు. వారి పేరు భద్రయ్య,వీరయ్య. వారికి సరైన స్తోమత లేక పెద్దగా చదువుకోలేదు. తెలివితేటలూ లేక చాతుర్యం
లేక తంటాలు పడుతుండేవారు. తమ పేదరికాన్ని పోగొట్టుకోవడం కోసం ఎలాగైనా సరే డబ్బు
సంపాదించాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. ఒకరోజు తమ ఊరికి దగ్గరలో ఉన్న
సముద్ర తీరానికి వెళ్లారు. అక్కడ వారికి బెస్త వాళ్ళ కుటుంబాలు కనిపించాయి. వారిని
గమనిస్తే వారంతా సమృద్థిగా చేపలను పడుతూ వాటిని మంచి ధరలకు అమ్ముతూ, చాల ఆనందంగా
కాలం గడుపుతున్నారని గుర్తించారు. వారిని చూస్తున్న కొద్ది, అన్నదమ్ములిద్దరికీ ఒక
ఆలోచన తట్టింది. మనమిద్దరం ఎలాగూ బ్రాహ్మాణ కుటు౦బీకులమే గనుక మనకు తోచిన
పాండిత్యంతో వారికి జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదిద్దామని అనుకున్నారు. మరుసటి
రోజు అన్నదమ్ములిద్దరు తలపాగాలు ధరించి, విబూది పెట్టుకొని, పెద్దపెద్ద పుస్తకాలు
పట్టుకొని ఆమత్య్సకారుల వద్దకి వచ్చారు. "మేము జ్యోతిష్య పండితులం" అని
తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆ మత్య్సకారులు వీరిని మహా జ్యోతిష్యపండితులని
నమ్మారు. వచ్చిరాని మంత్రతంత్రాలతో అన్నదమ్ములు వారికి తమకి తోచినది చెప్పేవారు. మత్య్సకారులు వీరు చెప్పినదంతా నిజం అనుకొని
తాము కూడబెట్టుకున్న డబ్బంతా వారికి సమర్పించేవారు. అలా అన్నదమ్ములిద్దరు
అమాయకులైన ఆ బెస్త కుటుంబాలను నమ్మించి బాగానే డబ్బు కూడబెట్టుకున్నారు. కొంతకాలం
అయిన తర్వాత ఇంకా ఉంటే తమ గుట్టురట్టవుతు౦దనుకొని అంతవరకు ఆ చేపలు పట్టే కుటుంబాల నుండి
సంపాదించుకున్న డబ్బంతా మూటగట్టుకొని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు.
దారిలో డబ్బుమూట బరువు ఎక్కువై ఒకరుమార్చి ఒకరు
మోస్తూ వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తూ మనసులో "నేనే ఈడబ్బంతా తీసుకుంటే ఎంత
బాగుంటుంది దాని కోసం నా సోదరుణ్ణి చంపినా తప్ప్పులేదు. అని ఆలోచన ఎవరికివారే చేయసాగారు. ఇంతవరకు అన్నదమ్ములిద్దరూ ఎంతో
అన్యోన్యంగా ఉండేవారు. ఇప్పటికీ వారి మధ్య
అనురాగం ,ఆప్యాయత అలాగే ఉన్నాయి. కానీ తమ దగ్గర ఉన్న డబ్బు మూట ఎవరికివారే తమకే దక్కాలన్న విపరీతమైన దురాశతో
ప్రాణాలు తీసే అంతా పాపానికి వారి బుద్ధి సిద్ధమైంది. ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఇంటికి దగ్గర
అవసాగారు. ఇల్లు దగ్గరైనా తర్వాత వారిద్దరి మనసులో ఏదోతెలియని అలజడి మొదలయింది.
దా౦తో అన్నదమ్ములిద్దరు తమకు వచ్చిన చెడు ఆలోచన ఒకరితోఒకరు చెప్పుకున్నారు. వారిలో
పరివర్తన కలిగింది. మనలో దూరాన్ని పెంచి, మన ప్రేమని తుంచే ఈ పాపిష్టి సొమ్ము మనకు
వద్దు, అనుకొని ఇంటి ముందు ఉన్న చెత్తకుండిలో ఆ సొమ్ము పడివేసి అన్నదమ్ములిద్దరూ మనశ్శాంతితో ఇంట్లోకి అడుగుపెట్టారు. అదే సమయంలో పెద్దవాడైన భద్రయ్య భార్య కూరగాయలు తరగగా
వచ్చిన చెత్తను, చెత్తకుండిలో వేయడానికి వచ్చి చెత్తకుండిలో ఉన్న డబ్బుని చూసి
అదంతా మూటకట్టుకొని, తన భర్తకు ఇవ్వాలని అనుకుంటూ ఉండగా కూరగాయల చెత్తతో పాటు
కత్తిని తీసుకువెళ్ళిన తన తోటి కోడలు ఇంకా రాలేదని సోదరుడు వీరయ్య భార్య కత్తితో
అవసరం పడి తన తోటి కోడలు వద్దకు వచ్చింది. "ఏం చేస్తున్నావు" అంటూ
దగ్గరకి వస్తున్న తన తోటికోడలు
చెత్తకుండిలో నుండి తాను తీసి దాచుకున్న డబ్బును చూసి ఉండవచ్చు అన్న భావంతో ఆమెకు
తెలిసిపోయిందన్న స్వార్ధంతో అపరాధ భావ౦తో తన చేతిలో ఉన్న కత్తితో తోటి కోడలు
కడుపులో పొడిచివేసింది. ఆమె అరుపు విని బయటకు వచ్చిన భద్రయ్య,వీరయ్యను చూసి భయంతో
భద్రయ్య భార్య ఆకత్తితో తనకు తాను పొడుచుకొని మరణించింది. ఇది చూసిన అన్నదమ్ములు
తమకు వచ్చిన పాపు ఆలోచనలకు తిరిగి పాపభీతితో ఆడబ్బుని వదిలి౦చుకున్నాగాని ,
ఎందరినో మోసగించి సంపాదించిన సొమ్మువల్ల తమ కుటుంబమే చిన్నాభిన్నం అయిందని తమ స్వార్ధానికి
తగిన ఫలం లభించినదని భద్రయ్య,వీరయ్య దు:ఖించారు.
నీతి: తమ స్వార్ధపరమైన మోసానికి తగిన పాప
ఫలితాన్ని ఎవ్వరైనా అనుభవించక తప్పదు.
No comments: