పంచతంత్రం
పంచతంత్రం
చాలాకాలంగా ప్రపంచంలో ఉన్న నీతి కథలను
క్రీస్తుపూర్వం 300 లో "పంచతంత్రం"
పేరుతో సంకల్పించారు. ఇందులోని పాత్రలన్నీ జంతువులే. విష్ణుశర్మ అనే గురువు
లోకజ్ఞానం లేని, బుద్ధి వికసించని రాజకుమారులను పాలనాదక్షులుగా తీర్చి దిద్దడానికి
కథల రూపంలో చేసిన నీతి బోధన. ఈ సంస్కృత గ్రంధం సుమారు వెయ్యేళ్ళ నాడే అనేక ప్రపంచ
భాషలలోకి అనువదించబడినది. ఇందులో 5 భాగాలుగా అనేక అధ్యాయాలతో
ఉంటుంది.
1-
మిత్రభేదం-
మిత్రుల మధ్య పొరపొచ్చలు రావటం మిత్రులను పోగొట్టుకోవడం మనకు నష్టం చేకూరుస్తుందని
ఇందులోని కథల సారాంశం.
2-
మిత్ర
లాభం లేక మిత్ర సంప్రాప్తి- స్నేహితులే నిజమైన బలం సైనిక బలగాలు ఆయుధాల కన్నా!
స్నేహితులతో స్నేహమే "మనకు పెట్టనికోట".
3-
కోకిల, కాకులు- గుడ్ల గూబలు ఇందులోని పాత్రలు యుద్ధమూ-శాంతి అన్న విషయాలు ఇందులోని
కథ వస్తువులు.
4-లబ్ద
ప్రణాశనం- లాభనష్టాలు, సంపాదించుకోవటం, పోగొట్టుకోవటం గురించిన నీతిబోధ.
5-పరీక్షిత
కారకం- "నిదానమే ప్రధానం", "ఆలోచించి అడుగు వేయి తొందరపాటు మనకు
నష్టం చేకూరుస్తుంది". అన్న కథాంశంతో ఉంటాయి. ఈ కథలు
తెలుగు వాళ్లకు "పంచతంత్రం" కథలు గా సుపరిచితమే.
No comments: