మూడు వరాలు-వివేకంలేనివాడు |


మూడు వరాలు-వివేకంలేనివాడు

పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య కురూపి తన పేదరికం కన్నా భారకు రూపమే అతన్ని అమితంగా బాధించేది ఒకరోజు అతను నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యనమస్కారాలు చేసాడు. ఆ తర్వాత అక్కడే కూర్చుని సూర్యుని వైపు చూస్తూ నిన్నందరూ లోక బాంధవుడు అని భక్త సులభుడు అంటారు కదా నాకు మాత్రం వరాలు ఎందుకు ఇవ్వవు అంటూ ప్రార్థించాడు అది చూసిన సూర్య భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు జాలిపడి అతనికి 3 కొబ్బరికాయలు ఇస్తూ నీకు మూడు వరాలు ఇస్తున్నాను మీకు ఏది కావాలి ఏది కావలిస్తే అది కోరుకొని కొబ్బరికాయ కొట్టిన వెంటనే అది ఫలిస్తుంది అలాగని అన్ని ఒకేసారి కోరుకొన అక్కర్లేదు నీకు కావలసినప్పుడు కోరుకొన వచ్చు అని చెప్పాడు సూర్యభగవానుడు అతను పరమానందంతో ఆ కొబ్బరి కాయలను అందుకున్నాడో లేదో ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు అతనికి దూరంగా భార్య నీళ్ళబిందె తో కనిపించింది. ఎండపొడ ఆమె మీద పడుతోంది ఆమె మీద ఎండ పొడ పడడంతో భార్య మరీ అనాకారిగా కనిపించింది దాంతో ఇక ఉండబట్టలేక తన భార్య అతిలోక సుందరిగా మరి పోవాలనుకోంటూ కొబ్బరికాయ కొట్టాడు అంతే ఆమె అద్భుత సౌందర్యరాశి గా మారిపోయింది సరిగ్గా అదే సమయంలో రాజుగారు రథం మీద వెళుతూ ఆమెను చూశాడు అంతటి అందగత్తే తన అంతఃపురంలో ఉంటే బాగుంటుందనిపించి ఆమెను చెయ్యి పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళసాగాడు అది చూసిన బ్రాహ్మణుడు తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటి లాగా మారి పోవాలనుకుని మరొక కొబ్బరికాయను కొట్టాడు రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటి గా మారిపోవడంతో రాజుకు మతిపోయింది కొంపతీసి ఈమె ఏమైనా మంత్రగత్తె మంత్రగత్తె నా ఏమో అనుకొంటూ రథం మీద నుంచి ఒక్క తోపుతోసివేసి వేగంగా వెళ్ళి పోయాడు రాజు ఆ భల్లూకం బ్రాహ్మణుడి మీదకి రాసాగింది దాంతో దిక్కుతోచని బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయ కూడా కొట్టి ఆమె తిరిగి ఎప్పటిలాగే మారిపోవాలని కోరుకున్నాడు వెంటనే అతని భార్యా తిరిగి మామూలుగా కురుపిగా మారిపోయింది భగవంతుడే కనికరించి మూడు వరాలు ఇచ్చినా ఆ మూడు వరాలు అతని పాలిట నిష్ఫలంగా మారిపోయాయి అతను పేదవాడిగా ఆమె అనాకారిగా మిగిలిపోయారు
ఏమయినా సద్వినియోగం చేసుకునే నేర్పు మనలో లేనప్పుడు ఎన్ని వరాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పడానికి ఇది ఉదాహరణ అతను తెలివితేటలను వివేకాన్ని ఉపయోగించి ఉంటే తన జీవితాన్ని మార్చివేసే వరాలను కోరుకుని ఉండేవాడు అందుకే మనిషికి విద్య వివేకం వివేచన ముఖ్యమని చెప్పారు పెద్దలు

No comments:

Powered by Blogger.