అతితెలివికి ఆశాభంగం |
అతితెలివికి ఆశాభంగం
విభీషణుడు లంకా నగరానికి రాజు అయిన తర్వాత
శ్రీరంగ పట్టణం లోని రంగనాథ్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తుండే వాడు.
ఒక వ్యక్తి అది గమనించాడు. అతను ఆశపోతు, అతి తెలివి గలవాడు. లంకానగరం చాలా సంపన్నమైనది
కాబట్టి ఎలాగైనా విభీషణుడి కన్నుగప్పి
లంకకు వెళ్తే బోలెడంత డబ్బు బంగారం తెచ్చుకోవచ్చు అనుకున్నాడు. ఆ ఆలోచన వచ్చిందే
తడవు ఒకరోజు విభీషణుడు పూజలో లీనమై ఉన్న సమయంలో మెల్లగా ఆయన వెంట ఉన్న పూలసజ్జ లో
దూరాడు.
పూజ అయిపోయిన వెంటనే, విభీషణుడు ఆ సజ్జను తీసుకొని ఆకాశమార్గాన లంకకు పయనమయ్యాడు. విభీషణుడు రాక్షస జాతి లో జన్మించాడు కాబట్టి అతనికి ఆ వ్యక్తి ఒక చీమ వంటి వాడే! విభీషణుడు లంకకు చేరుకున్న తర్వాత తన రథం దింపాడు. పూలసజ్జ లో నుంచి ఆ వ్యక్తి బయటకు వచ్చాడు విభీషణుని చూసి భయంతో వణికిపోయాడు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన విభీషణుడు అతన్ని అనునయించి భయాన్ని పోగొట్టి మెల్లగా అతని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు.
సహజంగానే మంచి వాడు దాన గుణ సంపన్నుడు అయిన విభీషణుడు ఆ వ్యక్తి సాహసానికి ముచ్చట పడ్డాడు. అతని కోరిక తీర్చాలని తన అనుచరులను పిలిచి అతనికి ఏమి కావాలో ఇచ్చి తిరిగి భద్రంగా శ్రీ పట్నం చేర్చమని ఆదేశించాడు.
విభీషణుని సేవకులు అతన్ని అరచేతిలో పెట్టుకొని తీసుకెళ్లి కోశాగారం ముందు దించారు. అక్కడ ఉన్న అమూల్యమైన మణిమాణిక్యాలు రత్నాభరణాలు అపారమైన సంపదను చూసి సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు. ఏది కావాలో తేల్చుకోలేక దిక్కులు చూడసాగాడు. విభీషణుని సేవకులు అది చూసి చిన్నగా నవ్వుకొని "ఏం కావాలో తొందరగా చెప్ప"మన్నారు. అతను ఎంతో తెలివిగా "మీరు అలా అడిగితే నాకేమీ తెలుస్తుంది? మీ రాజ్యంలో కెల్లా అమూల్యమైనది, అపురూపమైనది అయిన వస్తువును తెచ్చి ఇవ్వండి" అన్నాడు. ఆ రాక్షసులు కాసేపు ఆలోచించి ఒక చిన్న బంగారు భరిణను తీసుకొని వచ్చి దానిని అందంగా అలంకరించి ఉన్న ఒక పెద్ద పెట్టెలో పెట్టి అతని ముందుంచారు.
"మా రాజ్యంలోకి కెల్లా అపురూపమైన వస్తువు ఇదే! నిన్ను తీసుకు వెళ్లి మీ రాజ్యంలో దించాలి. మేము ఇక రా! నువ్వు" అంటూ కళ్ళు మూసి తెరిచేలోగా అతన్ని శ్రీరంగపట్నం లోని స్వామివారి ఆలయం ముందు దించి అక్కడి నుంచి మాయమైపోయారు. ఆ వ్యక్తి ఎంతో ఆత్రంగా ఆ పెట్టెలో నుంచి ఆ భరిణను బయటకు తీసి దానిలో ఉన్న వస్తువును చూసి విస్తుపోయి,నిర్గాంత పోయాడు.
ఆ తర్వాత తన అతితెలివికి లబోదిబోమని నెత్తీ నోరూ కొట్టుకున్నాడు ఎందుకంటే అది ఒక సాధారణమైన సూది మాత్రమే! కానీ లంకా నగర వాసులకు అది ఎంతో అమూల్యమైనది. శ్రీ రామకృష్ణ పరమహంస ఈ కథ ద్వారా "ఆశపోతులు ఎప్పటికైనా శృంగభంగం తప్పద"ని శిష్యులకు బోధించేవారు.

No comments: