పరీక్ష


పరీక్ష
విజయపురిని విక్రమవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ఒకేఒక్క కూతురు ఆమె పేరు చంద్రమతి. పేరుకు తగినట్టుగానే చంద్రమతి చాల అందంగా ఉండేది. ఆమెకు వివాహం చేయాలని రాజు నిశ్చయించారు. రాజ్యంలో యోగ్యులైన సామంత రాకుమారులను పిలిపించాడు. తన కుమార్తెను పిలిచి " ఈ రాకుమారులలో కొందరిని ఎంపిక చేయ్యి వారి గుణగణాలను ధైర్య సాహసాలను పరీక్షిద్దాం. అందులో నెగ్గిన వారిని వివాహానికి ఎన్నుకోవచ్చు" అని చెప్పాడు. చంద్రమతి అందుకు సరేనంది. అక్కడకు వచ్చిన రాకుమారులలో ముగ్గురిని ఎంపిక చేసింది. ఎంపిక చేసిన రాకుమారులను పిలిచి విక్రమవర్మ "మీకు ముగ్గురికి వారం రోజుల సమయం ఇస్తున్నాను. రాకుమారి మెచ్చే పని ఎవరు చేస్తారో వారే నాకు కాబోయే అల్లుడూ, రాజ్యానికి రాజు అవుతాడు అన్నాడు. వెంటనే ముగ్గురు రాకుమారులు గుర్రాలపై దేశాటనకు బయలుదేరారు. వారం రోజుల తర్వాత ముగ్గురు తిరిగి వచ్చారు. వారిలో మొదటివాడైన శ్రీపతిరాజు రత్నాలు,కెంపులు,ముత్యాలతో చేసిన ఆకర్షనీయమైన ఆభరణాలను రాకుమారి కోసం తెచ్చాడు. రెండవ వాడైన మాదవరాజు ఖరీదైన యుద్ధ సామగ్రి తీసుకువచ్చాడు. మూడవవాడైన విజయరాజు ఖాళీ చేతులతో మాత్రమే వచ్చాడు. కారణం ఏమిటని మహారాజు, యువరాణి అతన్ని అడగగా....అతడు ఇలా చెప్పాడు "నేను ఒక గ్రామానికి చేరుకోగానే అక్కడి ప్రజల ఆక్రందనలు వినిపించాయి. అక్కడకి వెళ్లి చూస్తే దోపిడీ దొంగలముఠా గ్రామస్తులను దోచుకోవడం చూసి అక్కడి గ్రామ యువకుల సహాయంతో ఆ ముఠాని గ్రామ పొలిమేరల వరకు తరిమికొట్టాను. ఆ దొంగలు మరల తిరిగి వస్తారని గ్రామస్తులు బయపడుతుంటే ఈవారం రోజులు ఆగ్రామ౦లోని యువకులకు కొంత శిక్షణ ఇచ్చి దొంగలనుండి ఎలా కాపాడుకోవాలో వారికి తగిన జాగ్రాత్తలు చెప్పి, ధైర్యం చెప్పాను" అని సమాధానమిచ్చాడు.
     విక్రమవర్మ మహారాజు,రాకుమారి,విజయరాజు చెప్పిన మాటలకు ఎంతో మెచ్చుకొని సంతృప్తులయ్యారు. "కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే వాడే ఈ రాజ్యానికి రాజుగా,నాకు అల్లుడిగా కావాలి. మీరు ముగ్గురు వెళ్ళే దారిలో దోపిడీ దొంగల దాడి ఏర్పాటు చేయించింది మేమే, మీ ముగ్గురి స్వభావాన్ని తెలుసుకోడానికి నేను చేసిన ఏర్పాటు. గ్రామస్తుల కేకలు విని నీవు స్పంది౦చావు. మిగతా ఇద్దరు స్పందించలేదు కనుక ఈపరీక్షలో విజయం సాధి౦చి రాకుమారిని,రాజ్యాన్ని గెలుచుకున్నావు" అంటూ యువరాణి చంద్రమతి చేతులతో విజయరాజు మేడలో వరమాల వేయించాడు మహారాజు,   

No comments:

Powered by Blogger.