అతి తెలివి


అతి తెలివి
పాటలీపుత్రాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించాడు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. ప్రజారంజకుడైన పాలకుడు. ఒకసారి దేశంలో వర్షాలు పడక కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పంటలు పండలేవు. రైతులు అనేక ఇబ్బందులు పడసాగారు. రైతుల స్థితిగతులను స్వయంగా పరిశీలించి తగిన సాయం అందజేయలనుకున్నాడు మహారాజు. అందుకే మారువేషాల్లో రైతుల ఇళ్ళకు వెళ్ళేవాడు. వారి ఇళ్లలోనే భోజనం చేసి వారి స్థితిగతులను స్వయంగా గమనించేవాడు. మర్నాడు రాజభటులతో వారికీ సాయపడడానికి బంగారు నాణేలు పంపేవాడు. అయితే ఈ విషయాలేవీ బయటకు తెలియనీయకుండా రహస్యంగా ఉంచేవాడు.
      రాజుగారు మారువేషాల్లో పర్యటిస్తూ బంగారు నాణేలు పంపుతున్న విషయాన్ని రాజ దర్బార్ లో పనిచేసే తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్నాడు శేషయ్య. పచ్చని మెతుకులు పెడితేనే బంగారు నాణేలు ఇస్తున్నాడు కదా రాజు షడ్రసోపేత భోజనం పెడితే ఇంకెన్ని విలువైన కానుకాలు పంపిస్తాడో కదా! అనుకున్నాడు శేషయ్య.
     అందుకే మర్నాడు తన ఇంటికి మారువేషంలో వచ్చిన వ్యక్తికి ఘనంగా విందు భోజనం పెట్టాడు శేషయ్య. రైతుల౦దరు పచ్చటి మేతుకులతో సరిపెట్టుకు౦టు౦టే శేషయ్య విందు ఏర్పాటు చేయడంతో అతని ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని రాజు ఉహించాడు. మర్నాడు శేషయ్య దగ్గర రెట్టింపు పన్ను వసూలు చేసి తీసుకురమ్మని భటులను పంపాడు. అలా శేషయ్య   అతి తెలివీ అత్యాశల వల్ల బంగారు నాణాలు దక్కకపోగా ఎక్కువ పన్ను చెల్లించుకోవాల్సి వచ్చింది.
నీతి: అతి తెలివీ, అత్యాశ ఎప్పుడు పనికిరావు అన్నదే ఈ కథలోని నీతి.


No comments:

Powered by Blogger.