అపూర్వ గురుశిష్యులు |
అపూర్వ గురుశిష్యులు
బాల్యం నుంచే
హనుమంతుడు మహాశక్తిశాలి, మహా బలవంతుడు. దీనికితోడు సహజసిద్ధమైన వానర
లక్షణాలు ఉండడంతో ఆకతాయి పనులు చేసేవాడు. మునుల ఆశ్రమం పైబడి
వారు ఆర వేసుకున్న బట్టలను చింపి పోగులు పెట్టడం, వాళ్ళ
గడ్డాలు పట్టుకొని లాగడం, అగ్నిహోత్రాలు ఆర్పి వేయడం వంటి
అల్లరి పనులు చేసేవాడు. దాంతో కోపించిన మునులు ఎవరైనా గుర్తు
చేసే వరకు నీ శక్తి సామర్ధ్యాలు నీకు గుర్తుకు రావు అని శపించారు. దీంతో హనుమంతునికి అల్లరి చేష్టలు తగ్గి చదువు ధ్యాస పట్టుకుంది. అయితే అల్లరి మాని నా కానీ హనుమకు చదువు చెప్పే వారె కరువయ్యారు. దాంతో దిగులు పడుతున్న హనుమంతుని తల్లి అంజనాదేవి ఓదార్చింది. "నాయనా!
సూర్య భగవానుడు సకల విద్యాపారంగతుడు. ఆయనకు తెలియని శాస్త్రం అంటూ లేదు.
సాక్షాత్తు విష్ణు స్వరూపుడాయన. కాబట్టి నీవు ఎలాగైనా సూర్యుడిని మెప్పించి ఆయన
వద్ద విద్యను నేర్చుకో" అని సలహా ఇచ్చింది. తల్లి మాటలకు సంతోషించిన హనుమ
వెంటనే ఆకాశానికి ఎగిరాడు. సూర్యునికి వినయంగా నమస్కరించి, తానెవరో, ఎందుకోసం
వచ్చాడో చెప్పి, తనకు విద్యాదానం చేయవలసిందని అభ్యర్థించాడు. "నీకు చదువు
చెప్పడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ, నిరంతరం సంచరిస్తూ,లోకాలన్నింటికీ వెలుగూ
వేడి అందించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా!, అటువంటి నా వద్ద చదువు ఎలా నేర్చుకోగలవు?" అన్నాడు సూర్యుడు.
సమాధానంగా వెంటనే హనుమ తన శరీరాన్ని అమాంతం పెంచేశాడు. ఒక కాలిని వింధ్య పర్వతం
మీద, మరో కాలిని మేరు పర్వతం మీద ఉంచాడు. తన ముఖాన్ని సూర్యుని ఎదురుగా ఉంచి,
ఇప్పుడు చెప్పండి గురువుగారు!" అన్నాడు. హనుమంతుడి సమయస్ఫూర్తికి సంతోషించిన
సూర్యుడు, వెంటనే తన శిష్యునిగా స్వీకరించాడు. అసాధారణ ధారణ గల హనుమ సూర్యునికి
అభిముఖంగా ఉంటూ, అయిన ఎటు తిరిగితే తానటు తిరుగుతూ అనేక విద్యలను నేర్చాడు. ఒకసారి
చెప్పిన దానిని మరొకసారి చెప్పవలసిన అవసరం లేకుండా, హనుమ ఏకసంథాగ్రాహిగా పేరు
పొందాడు. హనుమకు ఇంకా కొన్ని విద్యలు నేర్పాల్సి ఉంది కానీ, అది వివాహితులు
మాత్రమే నేర్వదగ్గ విద్యలు కాబట్టి, హనుమకు తన కూతురైన సువర్చలాదేవిని వివాహం
చేశాడని కొన్ని పురాణాల్లో ఉంటే, మరికొన్నింటిలోనేమో, హనుమను సువర్చలా దేవి ఇష్ట
పడిందని, సూర్యుని అభ్యర్థనతో తన బ్రహ్మచర్య వ్రతానికి భంగం వాటిల్లనివ్వనని షరతుమేరకు
ఆమెను పరిణయమాడి తన హృదయంలోనే నిలుపుకున్నాడు అని చెబుతారు. సూర్యుడి అంశతో
జన్మించిన సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ, శ్రీ రామ సుగ్రీవుల మధ్య మైత్రి కుదిర్చి,
సుగ్రీవుడిని అతని అన్న వాలి నుండి రక్షించడం ద్వారా గురుదక్షిణ చెల్లించుకున్నాడు
అంటారు. ఏమైనా శిష్యుడు అంటే అలా ఉండాలి... నవవ్యాకరణవేత్తగా శ్రీరాముడి చేత ప్రశంసలు
అందుకున్నాడు హనుమ.
No comments: