TelivainaKaaki katha- Intelligent crow story | తెలివైనకాకి కథ

తెలివైనకాకి కథ


ఒకసారి కాకి గారె  ముక్కను సంపాదించింది. చెట్టు కొమ్మ మీద వాలి తినబోయింది. అది చూసిన ఒక గుంట నక్క దానిని ఎలాగైనా కాజేయాలనుకుంది. గబగబా ఆచెట్టు క్రిందకు చేరి, "కాకిబావ! కాకిబావా! ఒక పాట పాడు" అని అడిగింది. కాకి తెలివిగా గారె ముక్కను కాలి క్రింద ఉంచుకుని, పాట పాడసాగింది. నక్క తన పన్నాగం పారనందుకు చింతించింది. మరలా "కాకిబావా! కాకిబావా! నువ్వు ఇటీవల నాట్యం నేర్చుకున్నావని విన్నాను. నీ నాట్యం చూడాలని ఉంది" అని అడిగింది. కాకి గారె ముక్కను ముక్కున కరుచుకుని. గాలిలో  నాట్యం చేసి తిరిగి కొమ్మమీద వాలింది. ఆఖరి ప్రయత్నంగా నక్క,  "నాట్యం చేస్తూ పాట పాడు బావా మధురంగా ఉంటుంది" అన్నది. అందుకు కాకి ఒకక్షణం ఆలోచించి చటుక్కున గారె ముక్కను తినేసి నాట్యంచేస్తూ పాట పాడసాగింది. కాకి తెలివికి గుంటనక్క ముఖం మాడ్చుకుని అడవిలోకి పరిగెత్తింది.

నీతి :- 
పిల్లలు మీరు గమనించవలసింది ఏమిటంటే "మనము సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనవచ్చు" అని తెలుస్తుంది.


TelivainaKaaki story

Telugu (Story in English letters)

Okasaari kaaki gaare  mukkanu sampaadinchindi. Chettu komma miida vaali tinaboyindi. Adi chusina oka guntanakka danini elagaina kaajeyaalanukundi. Gabagaba aachettu krindaku cheri, "kaaki baava, kaakibaava oka paata paadu" ani adigindi. Kaaki telivito gaare mukkanu kaali krinda unchukuni, paata paadasaagindi. Nakka tana pannaagam paarananduku chintinchindi. Marala "kaakibaava, kaakibaava nuvvu itivala naatyam neerchukunnavani vinnaanu. Nie naatyam chudaalani undi" ani adigindi. Kaaki gaare mukkanu mukkuna karuchukuni. Galilo  naatyam chesi tirigi kommamiida vaalindi. Akhari prayatnamgaa nakka,  "naatyam chestu, paata paadu baava madhuramgaa untundi" annadi. Anduku kaaki okkakṣhanam alochinchi chatukkuna gaare mukkanu tinesi naatyam chestu paata paadasaagindi. Kaaki teliviki guntanakka mukham madchukuni adaviloki 
parigettindi.
Niti
Pillalu prati okkaru gamaninchavalasindi manamu samayasphurtito alochiste yetuvanti samasyanaina yedurkona vachu ani telustundi.

No comments:

Powered by Blogger.