Raghuvamsavirbhavam-story | రఘువంశావిర్భావం


రఘువంశావిర్భావం
దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి. వారికి సకల సంపదలు ఉన్నాయి. కానీ సంతానం మాత్రం లేకపోవడంతో, వశిష్ట మహర్షి వద్దకు వెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు. ఆయన తన వద్ద ఉన్న నందిని అనే ధేనువును ఆ రాజదంపతులు కిచ్చి "దీనిని నిష్టగా సేవించండి, తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది" అని చెప్పాడు. ఆ దంపతులు ఆ ఆవును తీసుకుపోయి భక్తిశ్రద్ధలతో సేవించు కొనసాగారు. రాజు దాన్ని అడవికి తీసుకుపోయి అది మేత మేసిన తర్వాత తీసుకువచ్చేవాడు. ఓరోజున రాజు ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ ఆవు తప్పిపోయింది.రాజు దాని కోసం వెతుకుతుండగా, సమీపంలో ఉన్న ఒక గుహ నుండి దాని అంబారావాలు వినిపించాయి. వెంటనే రాజు ఆ గుహలోకి ప్రవేశించాడు. అక్కడ ఆ ఆవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దిలీపుడు వెంటనే బాణం సంధించాడు. చిత్రంగా ఆయన చెయ్యి స్తంభించి పోయినట్లయింది. ఆశ్చర్యంతో నిలబడిపోయిన రాజుతో ఆ సింహం మానవభాషలో "రాజా! నేను శివుడికి అత్యంత ఆప్తుడనైనా "కుంభోధరుడు" ననే వాడును శివుడు నందిని అధిరోహించే ముందు నా పై కాలు పెట్టి ఎక్కుతాడు. ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్షాదులను భక్షించడం నా హక్కు. ఇప్పుడు ఈ ఆవును చంపితిని నా ఆకలిని తీర్చుకుంటాను, అడ్డులే"! అంటూ తొందర చేశాడు కుంభోధరుడు. "మా గురువు వశిష్ఠుడు దీని బాధ్యతను నాకు అప్పగించారు. సంరక్షణలో ఉన్న ఈ ఆవును విడిచిపెట్టు లేదా నేనే దాని బదులుగా నీకు ఆహారమౌతాను" అన్నాడు దిలీపుడు. "పిచ్చివాడా! ఆవు కోసం ప్రాణాలైనా వదులుకుంటావా! నీవు రాజువి, నీ ప్రాణాలు ఉంటే ఇటువంటి 1000 ఆవులను దానంగా ఇవ్వచ్చు"! అంది సింహం. అప్పుడు రాజు "ఆవునే కాపాడలేని వాడిని! నేనింకా ప్రజల ప్రాణాలేమీ కాపాడగలను ?అందుకే నన్ను చంపి ఆకలి తీర్చుకో"! అంటూ ప్రాధేయపడ్డాడు రాజు. అంగీకరించింది సింహం. కళ్ళు మూసుకున్నాడు రాజు అయితే సింహం తన మీద పడకపోగా పైనుంచి పూల వర్షం కురవడంతో పాటు! "కుమారా! అన్న పలుకులు వినపడటంతో..! ఆశ్చర్యంగా! కళ్లు తెరిచాడు దిలీపుడు.కాని అక్కడ సింహం లేదు! "రాజా నీ ధర్మ! తత్పరత మెచ్చాను! నా పాలు పిండి నీవు నీ భార్య ఇద్దరు తాగండి. సత్సంతానం ప్రాప్తిస్తుంది" అని చెప్పింది నందిని. దిలీప మహారాజు ఆవు పాలు పితికి తాను తాగి, భార్యకు కూడా తాగించాడు. రాణి గర్భం ధరించి పండంటి బిడ్డను ప్రసవించింది. ఆతడే "రఘుమహారాజు" రాముడికి తాతగారు. ఆయన పేరు మీదుగానే "రఘువంశము" ఏర్పడింది. రాముడు ఆయన నుండి ధర్మాన్ని పుణికిపుచ్చుకున్నాడు. రఘురాముడయ్యాడు.

No comments:

Powered by Blogger.