హిమవంతుని గర్వభంగం | Himavantuni garvabhangam | The proud of the snowman
హిమవంతుని గర్వభంగం
పర్వతరాజు హిమవంతుడికి మనసు మనసులో లేదు.
ఎట్టకేలకు తన గారాలపట్టికి పెళ్ళి కుదిరింది. మహా సంపన్నుడు తను, తన కుమార్తె
పార్వతి కఠోర తపస్సు చేసి మరీ ఒక జంగమ దేవరని పెళ్లాడబోతోంది. పెళ్లికి సాధువులు,
మునులు, బ్రాహ్మణులు దేవతలు అందరూ విచ్చేస్తారు. వీరందరికీ నా ఐశ్వర్యాన్ని
చూపించాలి. వారికి పెట్టిన భోజనం చేసిన అతిధి మర్యాదల గురించి అందరూ గొప్పగా
చెప్పుకోవాలి అనుకున్నాడు. పెళ్లి వాళ్లకోసం 56 రకాల పిండి వంటకాలు తయారు
చేయించాడు. వారికి వసతి అతిథి సౌకర్యాల ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నాడు. హిమవంతుడి
మనస్సును గ్రహించాడు ముక్కంటి,
ఎలాగైనా అతని అహంకారాన్ని తగ్గించాలని అనుకున్నాడు. వెంటనే శనీశ్వరుడిని, ఆంజనేయుడిని పిలిచాడు. "మీరిద్దరూ మారువేషంలో హిమవంతుడి ఇంటికి వెళ్ళండి. అక్కడ ఉన్న ఆహారాన్ని భుజించండి" అని చెప్పాడు.
ఆంజనేయుడు,శనేశ్వరుడు ఇద్దరూ ఎలుక రూపంలో వెళ్ళి వండి వడ్డించడానికి సిధ్ధంగా ఉన్న ఆహారపదార్థాలను ఆవురావురుమని భుజించసాగారు. సేవకులు హిమవంతుని వద్దకు వెళ్లి "మహారాజా! రెండు ఎలుకలు వంటశాలలోకి దూరాయి. వండిన ఆహార పదార్థాన్ని వండినట్లుగా తినేస్తున్నాయి. మేము ఎంత అదిలించినా పోవడం లేదు" అని మొర పెట్టుకున్నారు. హిమవంతుడు ఆ రెండు ఎలుకలను బంధించడానికి విఫలయత్నాలు చేశాడు. ఏమి చేయాలో పాలుపోక తన కుమార్తె పార్వతికి విషయం చెప్పాడు. పార్వతీదేవి తన తపోబలంతో ఆ ఎలుకల ఎవరో వాటిని పంపిందెవరే తెలుసుకుంది పరమేశ్వరుడిని మనసులో తలుచుకుంది. స్వామి! ఇక మీ ఆటలు చాలించండి. మీ! అనుచర గణాన్ని వెనుకకి పిలిపించండి" అని ప్రార్ధించింది. అంతే భోజనశాలలో ఎలుకల రూపంలో ఉన్న శనీశ్వరుడు,ఆంజనేయుడు పార్వతిదేవికి ప్రణమిల్లుతూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆహం అణిగిన హిమవంతుడు
ఈశ్వరుడిని ఆయన అనుచర గణాలను స్వయంగా ఎదురువెళ్ళి ఆహ్వానించి, భయభక్తులతో మర్యాదలు చేశాడు. అహం ఎంతటివారికైనా అనర్థం అన్నదే ఇందులోని నీతి.
ఈశ్వరుడిని ఆయన అనుచర గణాలను స్వయంగా ఎదురువెళ్ళి ఆహ్వానించి, భయభక్తులతో మర్యాదలు చేశాడు. అహం ఎంతటివారికైనా అనర్థం అన్నదే ఇందులోని నీతి.
No comments: